గుంటూరులో భారీ వర్షం
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం దాటికి రామిరెడ్డి తోటలో రెండు ఇళ్లు కూలిపోయాయి. దీంతో వారంతా ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. గత కొన్నేండ్లుగా ఉంటున్న గూడు చెదిరిపోవడంతో ఆ రెండిళ్ల వాసులు నిరాశ్రయులయ్యారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతే కాకుండా, వర్షం ప్రభావం తీవ్రంగా ఉండటంతో పలుచోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. దీంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపోయిందని సమాచారం. […]
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం దాటికి రామిరెడ్డి తోటలో రెండు ఇళ్లు కూలిపోయాయి. దీంతో వారంతా ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. గత కొన్నేండ్లుగా ఉంటున్న గూడు చెదిరిపోవడంతో ఆ రెండిళ్ల వాసులు నిరాశ్రయులయ్యారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతే కాకుండా, వర్షం ప్రభావం తీవ్రంగా ఉండటంతో పలుచోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. దీంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపోయిందని సమాచారం. రంగంలోకి దిగిన జీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.