20వ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు
దిశ, వెబ్ డెస్క్: కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క చమురు కంపెనీలు వాహనదారులు పగబడుతున్నాయి. పెట్రోల్ ధరలు పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచాయి. దీంతో 20 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 8.93 పైసలు, డీజిల్ పై రూ. 10.07 పైసలు పెరిగినట్టయ్యింది. పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర […]
దిశ, వెబ్ డెస్క్: కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క చమురు కంపెనీలు వాహనదారులు పగబడుతున్నాయి. పెట్రోల్ ధరలు పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచాయి. దీంతో 20 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 8.93 పైసలు, డీజిల్ పై రూ. 10.07 పైసలు పెరిగినట్టయ్యింది. పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.13 పైసలు, డీజిల్ ధర రూ. 80.19కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 83.16 పైసలు, డీజిల్ ధర రూ. 78.34 పైసలుగా ఉంది.