కానిస్టేబుల్ మృతి.. స్నేహానికి అర్థం చెప్పిన బ్యాచ్‌మేట్స్

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అకాల మ‌ర‌ణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని స్నేహితులు ఆదుకున్నారు. వివరాల ప్రకారం.. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న 2012 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన సివిల్ కానిస్టేబుల్ తియ్యారపు యాదగిరి గ‌త నెల 21న అకాల మ‌ర‌ణం చెందారు. స్నేహితుడి కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని భావించిన 2012 బ్యాచ్ వెల్ఫేర్ గ్రూప్ మనం.. నుంచి తోటి కానిస్టేబుళ్లు రూ.4,16,716ల‌ను బాధిత కుటుంబానికి గురువారం […]

Update: 2021-06-03 08:13 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అకాల మ‌ర‌ణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని స్నేహితులు ఆదుకున్నారు. వివరాల ప్రకారం.. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న 2012 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన సివిల్ కానిస్టేబుల్ తియ్యారపు యాదగిరి గ‌త నెల 21న అకాల మ‌ర‌ణం చెందారు.

స్నేహితుడి కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని భావించిన 2012 బ్యాచ్ వెల్ఫేర్ గ్రూప్ మనం.. నుంచి తోటి కానిస్టేబుళ్లు రూ.4,16,716ల‌ను బాధిత కుటుంబానికి గురువారం అంద‌జేశారు. యాద‌గిరి మ‌ర‌ణం త‌మ‌ను తీవ్రంగా క‌లిచి వేసిందని కానిస్టేబుళ్లు ఆవేద‌న వ్యక్తం చేశారు. యాద‌గిరితో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మనం వెల్ఫేర్ అసోసియేషన్-2012 అధ్యక్షుడు కొట్టె వినయ్ కుమార్, కార్యదర్శి వంశీ కృష్ణ, కోశాధికారి గంగారపు రాజేందర్, సభ్యులు నంద కిషోర్, అరవింద్, సలీం, సంతోష్, సంజయ్, రమేష్, నరేష్, విష్ణు, కిరణ్, శ్రీనివాస్, మురళి, రాజేష్, రమేష్ పాల్గొన్నారు.

 

Tags:    

Similar News