ఫ్రెండే కదా అని ఫోన్ ఇచ్చిన వివాహిత.. అదే ఆమె చేసిన మిస్టేక్.?
దిశ, వెబ్‌డెస్క్ : వారిద్దరూ కాలేజీలో క్లాస్‌మేట్స్. మూడేళ్ల పాటు వారి కలిసే చదువుకున్నారు. కాలేజీ అయిపోగానే సదరు యువతికి పెళ్లి అయింది. కానీ వారి స్నేహం మాత్రం కంటిన్యూ అవతూ వచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు సదరు యువకుడు ఓ సారి నీ ఫోన్ ఇవ్వు అని అడిగాడు. దీంతో ఫ్రెండే కదా అని ఆమె అతడికి ఫోన్ ఇచ్చింది. ఇదే ఆమె చేసిన పోరుపాటు ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని […]
దిశ, వెబ్‌డెస్క్ : వారిద్దరూ కాలేజీలో క్లాస్‌మేట్స్. మూడేళ్ల పాటు వారి కలిసే చదువుకున్నారు. కాలేజీ అయిపోగానే సదరు యువతికి పెళ్లి అయింది. కానీ వారి స్నేహం మాత్రం కంటిన్యూ అవతూ వచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు సదరు యువకుడు ఓ సారి నీ ఫోన్ ఇవ్వు అని అడిగాడు. దీంతో ఫ్రెండే కదా అని ఆమె అతడికి ఫోన్ ఇచ్చింది. ఇదే ఆమె చేసిన పోరుపాటు ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన రాజేష్ లోధి, హస్ముఖ్ ఇద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు. మూడేళ్లు మంచి స్నేహితులుగా ఉన్నారు.
ఈ క్రమంలో హస్ముఖ్‌కు వివాహం జరిగిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కాగా, సోమవారం హస్ముఖ్‌కు రాజేష్ ఫోన్ చేసి షాపింగ్‌కు రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి బైక్ మీద కేన్సర్ హిల్ వరకు వెళ్లారు. రాజేష్ ఒక్కసారిగా బైక్ ఆపి ఆమెను కిందకు దిగమని.. కాల్ చేసుకుంటాను అంటూ ఆమెను ఫోన్ అడిగాడు. ఫ్రెండే కదా అని మరో ఆలోచన లేకుండా ఆమె అతడికి ఫోన్ ఇచ్చింది. అయితే, ఫోన్ మాట్లాడుతున్నట్లు నటించిన రాజేష్.. ఒక్కసారిగా ఆమె చేతిలో నుంచి పర్సు లాక్కుని బైక్‌పై పారిపోయాడు. దీంతో షాక్‌లోకి వెళ్లిన హస్ముఖ్‌కు ఏం చేయాలో తోచలేదు. ఎలాగోలా స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. పర్సులో రూ. 48వేల డబ్బు, గోల్డ్ ఉన్నాయని పోలీసులకు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్‌ను వెతికే పనిలో పడ్డారు.