30 నిమిషాల్లో 33 ఫ్లోర్లు.. సైక్లిస్ట్ రేర్ ఫీట్
దిశ, వెబ్‌డెస్క్: అసాధారణ పనులు చేసినప్పుడే ఈ ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. అందుకే రేర్ ఫీట్స్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు ఫ్రెంచ్ సైక్లిస్ట్ మౌంటెయిన్ బైకర్ ఆరీలియన్ ఫొంటెనొయ్ కూడా అలాంటి అరుదైన ఫీట్ చేసి వార్తల్లో నిలిచాడు. మన రోజువారీ జీవితంలో మెట్లు ఎక్కడం సర్వసాధారణమే. అయితే 768 మెట్లు ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది? సరే ఆ మెట్లను సైకిల్ రైడ్ చేస్తూ ఎక్కడానికి ఎంత టైమ్ తీసుకుంటారు? ఓ గంట […]
దిశ, వెబ్‌డెస్క్: అసాధారణ పనులు చేసినప్పుడే ఈ ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. అందుకే రేర్ ఫీట్స్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు ఫ్రెంచ్ సైక్లిస్ట్ మౌంటెయిన్ బైకర్ ఆరీలియన్ ఫొంటెనొయ్ కూడా అలాంటి అరుదైన ఫీట్ చేసి వార్తల్లో నిలిచాడు.
మన రోజువారీ జీవితంలో మెట్లు ఎక్కడం సర్వసాధారణమే. అయితే 768 మెట్లు ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది? సరే ఆ మెట్లను సైకిల్ రైడ్ చేస్తూ ఎక్కడానికి ఎంత టైమ్ తీసుకుంటారు? ఓ గంట పైనే పడుతుంది కదా. కానీ, ఆరీలియన్ మాత్రం పోటో అనే ప్రాంతంలో ఉన్న ట్రినిటీ టవర్‌లో ఉన్న 33 ఫ్లోర్లను అరగంటలో ఎక్కి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతను ఎక్కడా కాళ్లు కింద పెట్టకపోవడం విశేషం. అరిలిన్ 33 అంతస్తులను సైకిల్‌పై చేరుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఈ ఫీట్ ఏదో సరదా కోసం చేయలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో పాటు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు తనవంతుగా విరాళాలు అందించడానికి చేశాడు. దాంతో నెటిజన్లు ఆరీలియన్‌ను ప్రశంసిస్తున్నారు. ‘చాలెంజ్ పూర్తి చేస్తానని అనుకోలేదు. ఫ్లోర్స్ ఎక్కుతున్న కొద్దీ భుజాలు, కాళ్ల కింద నొప్పి తీవ్రమైంది. మానసికంగా చాలా శ్రమతో కూడుకున్నది. చివరి మెటల్ స్టెయిర్ కేస్ మాత్రం చాలా జారుడుగా ఉంది. అక్కడ కాస్త భయమేసింది. కానీ, రైడ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆరీలియన్ పేర్కొన్నాడు.