అబుదాబిలో పర్యాటకులకు ఉచిత టీకా
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో పర్యాటకులకు ఉచితంగా కరోనా టీకా అందజేయనున్నారు. ఇంతకాలం యూఏఈ పౌరులు, రెసిడెన్సీ వీసాదారులకు మాత్రమే టీకా వేశారు. తాజాగా, అబుదాబిలో టూరిస్టులకు ఉచితంగా టీకా వేయాలని నిర్ణయించినట్టు అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ వెల్లడించింది. అబుదాబి జారీ చేసిన విజిటర్ వీసా, అబుదాబి గుండా యూఏఈలోకి ప్రవేశించిన టూరిస్ట్ వీసా కలిగిన పాస్‌పోర్టుదారులకూ ఈ అవకాశం ఉండనున్నట్టు పేర్కొంది. అత్యధిక జనసాంధ్రత గల దుబాయిలోనూ ఇది వర్తిస్తుందా? అనే […]
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో పర్యాటకులకు ఉచితంగా కరోనా టీకా అందజేయనున్నారు. ఇంతకాలం యూఏఈ పౌరులు, రెసిడెన్సీ వీసాదారులకు మాత్రమే టీకా వేశారు. తాజాగా, అబుదాబిలో టూరిస్టులకు ఉచితంగా టీకా వేయాలని నిర్ణయించినట్టు అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ వెల్లడించింది.
అబుదాబి జారీ చేసిన విజిటర్ వీసా, అబుదాబి గుండా యూఏఈలోకి ప్రవేశించిన టూరిస్ట్ వీసా కలిగిన పాస్‌పోర్టుదారులకూ ఈ అవకాశం ఉండనున్నట్టు పేర్కొంది. అత్యధిక జనసాంధ్రత గల దుబాయిలోనూ ఇది వర్తిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.