జర్నలిస్టులందరికి టీకా : ఉత్తరాఖండ్
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా పాత్రికేయులందరికీ టీకా వేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పాత్రికేయులు ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పనిచేసి సమాచారాన్ని అందించారని, సరైన వివరాలను వెల్లడిస్తూ వైరస్‌పై అవగాహనకు దోహదపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.