Google Chrome: క్రోమ్ ఫర్ సేల్..? గూగుల్ పై అమెరికా ఒత్తిడి..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్(Search Engine) దిగ్గజం గూగుల్(Google) ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు తన క్రోమ్ బ్రౌజర్(Chrome Browser)ను అమ్మేలా అల్ఫాబెట్(Alphabet)పై ఒత్తిడి చేయాలని యూఎస్(US) డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) కోరనుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్(Search Engine) దిగ్గజం గూగుల్(Google) ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు తన క్రోమ్ బ్రౌజర్(Chrome Browser)ను అమ్మేలా అల్ఫాబెట్(Alphabet)పై ఒత్తిడి చేయాలని యూఎస్(US) డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) కోరనుంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్(Bloomberg) ఓ కథనంలో పేర్కొంది. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ అక్రమంగా ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నదని ఆగస్టులో ఓ జడ్జి రూలింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే జడ్జి వద్ద డీవోజే ఈ ప్రతిపాదనను సమర్పించాలని భావిస్తోంది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని డీవోజే న్యాయమూర్తికి సూచనలు చేసినట్లు సమాచారం.
కాగా ఈ విషయంపై అధికారికంగా స్పందించడానికి డీవోజే నిరాకరించింది. మరోవైపు గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్(Lee Anne Mulholland) మాత్రం ఈ ప్రతిపాదనను తప్పుపట్టారు. ‘డీవోజే ఒక ర్యాడికల్ ఎజెండా ముందుకు తీసుకొస్తోంది. దీని వెనుక న్యాయ సమస్యలు ఉన్నాయి. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా జడ్జి దీనిపై ఏ విధమైన తీర్పు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. సెర్చ్ ఇంజిన్ పై గూగుల్ నిజంగానే ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నదని తీర్పు వస్తే గూగుల్ తప్పకుండా క్రోమ్(Chrome)ను వదులుకోక తప్పదని పలువురు చెబుతున్నారు.