బాలుడిని నోట క‌రుచుకెళ్లిన న‌క్క‌

దిశ‌, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ మండ‌ల‌ అటవీ ప్రాంతంలోని ఓ గొత్తికోయ పల్లెలో బాలుడిని నక్క నోట కరుచుకుని ఈడ్చుకెళ్లింది. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో విడిచిపెట్టింది. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ మండల కేంద్రానికి సుమారు 40 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లె రాళ్లచెలక. ఈ గ్రామానికి చెందిన ముక్తి యడమ, రాధ దంపతులకు మూడు నెలల […]

Update: 2020-11-20 03:29 GMT

దిశ‌, కొత్త‌గూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ మండ‌ల‌ అటవీ ప్రాంతంలోని ఓ గొత్తికోయ పల్లెలో బాలుడిని నక్క నోట కరుచుకుని ఈడ్చుకెళ్లింది. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో విడిచిపెట్టింది. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ మండల కేంద్రానికి సుమారు 40 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లె రాళ్లచెలక. ఈ గ్రామానికి చెందిన ముక్తి యడమ, రాధ దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చిన్నారిని పూరింటి వసారాలోని చీర ఉయ్యాలలో నిద్రపుచ్చిన తల్లిదండ్రులు లోపల పని చేసుకుంటున్నారు. కొద్దిసేపటికి చెట్లపొదల్లోంచి వచ్చిన నక్క చిన్నారిపై దాడిచేసింది. గోళ్లతో బాగా రక్కింది. తల భాగాన్ని నోట కరుచుకుని సుమారు పది అడుగుల దూరం లాక్కెళ్లింది. బిడ్డ కేకలతో బయటకొచ్చిన తల్లిదండ్రులు నక్కను అదిలించారు. దీంతో నక్క పసికందును వదిలేసి పరారైంది. అప్పటికే గోళ్లతో రక్కడంతో బిడ్డ ముఖం, తల భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు తలకు గాయమైన చోట కుట్లు వేశారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, రెండు రోజుల్లో డిశ్ఛార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News