ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు సహా నలుగురు పోలీసులు సస్పెండ్.. కారణం ఇదే..!

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ శ్వేతారెడ్డి సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. అవినీతికి పాల్పడుతూ మహిళా కానిస్టేబుళ్లు సస్పెండ్ కావడం జిల్లాలో ఇదే తొలిసారి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను ఆపి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు […]

Update: 2021-06-17 00:26 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ శ్వేతారెడ్డి సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. అవినీతికి పాల్పడుతూ మహిళా కానిస్టేబుళ్లు సస్పెండ్ కావడం జిల్లాలో ఇదే తొలిసారి.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు మంజీరా నది నుంచి ఇసుక తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను ఆపి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎస్పీ శ్వేతారెడ్డికి ఫిర్యాదులు అందాయి. వాటిపై శాఖపరమైన విచారణకు ఆదేశించిన ఎస్పీ.. ఆరోపణలు రుజువు కావడంతో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ చెందిన కానిస్టేబుళ్లు సంతోష్, పరందామయ్య, భవిత, మైశ కళ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

Tags:    

Similar News