లోన్ యాప్స్ కేసులో పురోగతి
దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే 200కు పైగా యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించగా… మరో 450 యాప్‌లను తొలగించాలని పోలీసులు లేఖ రాశారు. పోలీసుల రిక్వెస్ట్‌తో లోన్ యాప్స్ తొలగింపు ప్రక్రియను గూగుల్ ఇప్పటికే మొదలు పెట్టింది. హైదరాబాద్ నుంచి 288యాప్స్ తొలగించాలని పోలీసులు లేఖ రాయగా.. అటు సైబరాబాద్ నుంచి 110, రాచకొండ నుంచి 90లోన్ యాప్స్ తొలగించాలని పోలీసులు కోరారు. వందల సంఖ్యలో అకౌంట్లను నిలుపుదల […]
దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే 200కు పైగా యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించగా… మరో 450 యాప్‌లను తొలగించాలని పోలీసులు లేఖ రాశారు. పోలీసుల రిక్వెస్ట్‌తో లోన్ యాప్స్ తొలగింపు ప్రక్రియను గూగుల్ ఇప్పటికే మొదలు పెట్టింది. హైదరాబాద్ నుంచి 288యాప్స్ తొలగించాలని పోలీసులు లేఖ రాయగా.. అటు సైబరాబాద్ నుంచి 110, రాచకొండ నుంచి 90లోన్ యాప్స్ తొలగించాలని పోలీసులు కోరారు. వందల సంఖ్యలో అకౌంట్లను నిలుపుదల చేయడంతో పాటు మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు రూ.450కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బులతో చైనాకు చెందిన వారు ఈ యాప్‌లను నడపుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ కేసులో చైనాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు.