యాదగిరిగుట్టలో మట్టి అక్రమ రవాణా.. నలుగురి అరెస్టు

దిశ, నల్గొండ: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారింది. యాదగిరిగుట్ట పురపాలిక పరిధిలోని గుండ్లపల్లి వాగు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ల యజమాని గుండ్లపల్లి భరత్‌తోపాటు ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Tags: […]

Update: 2020-04-18 05:19 GMT

దిశ, నల్గొండ: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారింది. యాదగిరిగుట్ట పురపాలిక పరిధిలోని గుండ్లపల్లి వాగు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ల యజమాని గుండ్లపల్లి భరత్‌తోపాటు ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags: Four arrested, smuggling, clay, yadhadri bhuvanagiri

Tags:    

Similar News