వరదతో వచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
దిశ, వెబ్‌డెస్క్ : రాత్రికి రాత్రే ఓ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. వర్షం వచ్చి వరద రూపంలో కోట్ల రూపాయలను మోసుకొచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు ఇటీవల వచ్చిన వర్షానికి వరదలో ఓ వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి రూ.కోటి 20 లక్షలు ఇచ్చి గురువారం రాత్రి కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా, […]
దిశ, వెబ్‌డెస్క్ : రాత్రికి రాత్రే ఓ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. వర్షం వచ్చి వరద రూపంలో కోట్ల రూపాయలను మోసుకొచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు ఇటీవల వచ్చిన వర్షానికి వరదలో ఓ వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి రూ.కోటి 20 లక్షలు ఇచ్చి గురువారం రాత్రి కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
కాగా, కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి, తుగ్గలి, గిరిగెట్ల, చెన్నంపల్లి, రాంపురం తదితర గ్రామాల్లో గత కొంతకాలంగా వర్షాకాలం సమయంలో వచ్చే వరదలకు అత్యంత విలువైన వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం. అయితే వీటి విలువ తెలియని గ్రామస్తులకు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వ్యాపారులు గుట్టుగా అతి తక్కువ ధరకే కొనుగోలు చేసి, వజ్రాల వ్యాపారులకు అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అనంతపురం జిల్లా గుత్తి , కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి, తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామాల్లో ఈ దందా నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.