తీన్మార్ మల్లన్న అరెస్టుపై ‘బాంబు’ పేల్చిన మాజీ టీం సభ్యులు..
దిశ, ఖైరతాబాద్ : తీన్మార్ మల్లన్న అరెస్టులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన టీంలో పనిచేసిన మాజీ సభ్యులు చిలక ప్రవీణ్ అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్, చందులతో కలిసి ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం వల్లే అరెస్టు చేయడం జరిగిందన్నారు. తన చానల్‌ను అడ్డుపెట్టుకొని ఎంతో మందిని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అదే క్రమంలో లక్ష్మీకాంత శర్మను వేధించడంతో […]
దిశ, ఖైరతాబాద్ : తీన్మార్ మల్లన్న అరెస్టులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన టీంలో పనిచేసిన మాజీ సభ్యులు చిలక ప్రవీణ్ అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్, చందులతో కలిసి ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం వల్లే అరెస్టు చేయడం జరిగిందన్నారు. తన చానల్‌ను అడ్డుపెట్టుకొని ఎంతో మందిని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అదే క్రమంలో లక్ష్మీకాంత శర్మను వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శర్మ ఆత్మహత్యకు యత్నించారని అన్నారు.
ఈ మేరకు కేసు నమోదు అయిందని వెల్లడించారు. గత నాలుగు నెలలుగా విచారణ జరిపిన పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. ఇలా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందేనని అన్నారు. మల్లన్న అరెస్టు అయినందున మరికొంత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.