అచ్చెన్న కేసుపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బలవంతపు డిశ్చార్జిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. అచ్చెన్నను పరామర్శించేందుకు 29వ తేదీ ఉదయం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లామని, ఆయనకు గ్యాస్ట్రో ప్రాబ్లమ్ ఉందని, షుగర్ లెవల్స్ పడిపోయానని చెప్పారు. ఆహారం తీసుకోవడం లేదని, కొలనోస్కోపీ చేయాలని సూపరింటెండెంట్ చెప్పారని తెలిపారు. అచ్చెన్న ఆరోగ్యంపై సానుభూతి కూడా చూపారని, ఇన్ని […]

Update: 2020-07-01 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బలవంతపు డిశ్చార్జిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. అచ్చెన్నను పరామర్శించేందుకు 29వ తేదీ ఉదయం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లామని, ఆయనకు గ్యాస్ట్రో ప్రాబ్లమ్ ఉందని, షుగర్ లెవల్స్ పడిపోయానని చెప్పారు. ఆహారం తీసుకోవడం లేదని, కొలనోస్కోపీ చేయాలని సూపరింటెండెంట్ చెప్పారని తెలిపారు. అచ్చెన్న ఆరోగ్యంపై సానుభూతి కూడా చూపారని, ఇన్ని చెప్పి రెండ్రోజులు కూడా కాకముందే బలవంతంగా డిశ్చార్జి చేసి జైలుకు తరలించడం దుర్మార్గమని సోమిరెడ్డి విమర్శించారు. ఒక్క రోజైనా జైలులో పెట్టాలని ప్రభుత్వం పంతం పట్టినట్టుందని, జైలులో అచ్చెన్న ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత హెచ్చరించారు. కక్ష సాధింపులకు ఒక హద్దు ఉంటుందని సోమిరెడ్డి మండిపడ్డారు.

Tags:    

Similar News