ఓటరు చైతన్యంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్
దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో మార్పు కోసం, శాంతియుతంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పని చేస్తుందని ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హబ్సిగూడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు ప్రజాస్వామ్యంలో పునాది అని, ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు కరోనా సమయంలో తమ ప్రాణాలకు సైతం తెగించి ఉచితంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో మార్పు కోసం, శాంతియుతంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పని చేస్తుందని ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హబ్సిగూడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు ప్రజాస్వామ్యంలో పునాది అని, ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు కరోనా సమయంలో తమ ప్రాణాలకు సైతం తెగించి ఉచితంగా మెడిసిన్ సర్వీస్ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని, అవినీతి రహిత సమాజం కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, యువతను ఏకం చేస్తూ మరింత ముందుకు వెళ్తుందన్నారు. నేటి యువతరం సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలని, ఇతరులకు సహయ, సహకారం అందిస్తూ, వినూత్నంగా ముందుకు నడవాలన్నారు. తర్వాత యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.