ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కన్నుమూత!

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కమలేష్ చంద్ర చక్రవర్తొ(69) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో మరణించించట్టు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. కేసి చక్రవర్తి 2009లో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా(2001-2004 మధ్య), పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2007-2009 మధ్య ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియన్ బ్యాంక్(సీఎమ్‌డీగా 2005-2007 మధ్య) సహా ఇతర బ్యాంకుల్లో పనిచేశారు. ఆర్‌బీఐలో బ్యాంకింగ్ నియంత్రణతో […]

Update: 2021-03-26 07:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కమలేష్ చంద్ర చక్రవర్తొ(69) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో మరణించించట్టు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. కేసి చక్రవర్తి 2009లో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా(2001-2004 మధ్య), పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2007-2009 మధ్య ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియన్ బ్యాంక్(సీఎమ్‌డీగా 2005-2007 మధ్య) సహా ఇతర బ్యాంకుల్లో పనిచేశారు. ఆర్‌బీఐలో బ్యాంకింగ్ నియంత్రణతో పాటు పలు విభాగాలను చూసుకున్నారు. చక్రవర్తి జూన్ 15, 2009 నుంచి ఏప్రిల్ 25, 2014 మధ్య డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2018లో సీబీఐ దర్యాప్తులో ఉన్న రెండు కేసుల్లో నిదితుడిగా ఉన్నారు. అందులో విజయ్ మాల్యాకు చెందిన ఎయిర్‌లైన్ కింగ్ ఫిషర్ కేసులో చక్రవర్తిపై లుక్ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

Tags:    

Similar News