భారత్ లో ఉన్న ఆ ప్రాంతాలు మావే.. మేం అధికారం లోకి వస్తే..
దిశ, వెబ్ డెస్క్: నేపాల్ పార్లమెంట్ లో సంఖ్యా బలం లేక దిగిపోయిన మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇప్పుడు బీరాలు పలుకుతున్నాడు. తమ పార్టీ అధికారం లోకి వస్తే భారత్ తమవిగా చూపుకుంటున్న కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్ లను నేపాల్ లో కలిపేస్తాం అని ప్రకటించాడు. అందుకోసం భారత్ తో చర్చలు జరుపుతామని, ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఖాట్మాండ్ లోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 10 వ జనరల్ కన్వెన్షన్ ను ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య […]
దిశ, వెబ్ డెస్క్: నేపాల్ పార్లమెంట్ లో సంఖ్యా బలం లేక దిగిపోయిన మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇప్పుడు బీరాలు పలుకుతున్నాడు. తమ పార్టీ అధికారం లోకి వస్తే భారత్ తమవిగా చూపుకుంటున్న కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్ లను నేపాల్ లో కలిపేస్తాం అని ప్రకటించాడు. అందుకోసం భారత్ తో చర్చలు జరుపుతామని, ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు.
ఖాట్మాండ్ లోని సీపీఎన్-యూఎంఎల్ పార్టీ 10 వ జనరల్ కన్వెన్షన్ ను ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరు అయ్యడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేపాల్ భూభాగాలను తిరిగి కలుపుకుంటామని, దాని కోసం ఎంతవరకు అయినా పోతాం అని ప్రకటించాడు.