నిర్మల్ పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భారత మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ పట్టణానికి వచ్చారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భారత మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ పట్టణానికి వచ్చారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు, నాయకులు స్వాగతం పలికి పూల మొక్కను అందించారు. అనంతరం ఆయన అటవీశాఖ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన ఆయన.. తిరిగి ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.