‘ప్రణబ్’ సేవలు చిరస్మరణీయం : కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొద్ది సేపటి కిందటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత సీఎం కేసీఆర్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై సంతాన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. సీఎం మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా ప్రణబ్ విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని.. ప్రణబ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కేసీఆర్ అన్నారు. అంతేకుండా తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి […]

Update: 2020-09-07 00:40 GMT
‘ప్రణబ్’ సేవలు చిరస్మరణీయం : కేసీఆర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొద్ది సేపటి కిందటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత సీఎం కేసీఆర్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై సంతాన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. సీఎం మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా ప్రణబ్ విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని.. ప్రణబ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కేసీఆర్ అన్నారు.

అంతేకుండా తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి మరువలేనిదని.. ప్రణబ్ ఆచరించిన విలువలను కొనసాగిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రపతి హోదాలో గెజిట్ ఫైల్‌పై ప్రణబ్ సంతకం చేసిన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి సీఎం గుర్తుచేసుకున్నారు. ఇదిలాఉండగా, శాసన మండలిలో హోం మినిస్టర్ మహమూద్ అలీ ప్రణబ్ ముఖర్జీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Tags:    

Similar News