అప్పట్లో సచిన్.. ఇప్పుడు కోహ్లి

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ తర్వాత అంతటి స్టార్‌డమ్ అనుభవిస్తున్నది టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే. ఇతనికి మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్ జట్టులో కూడా కోహ్లిని ఆరాధించే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ ఉమర్ గుల్ కూడా చేరిపోయాడు. ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కోహ్లి అభిమాని అని చెప్పుకొచ్చాడు. ‘భారత […]

Update: 2020-06-27 06:14 GMT
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ తర్వాత అంతటి స్టార్‌డమ్ అనుభవిస్తున్నది టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే. ఇతనికి మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్ జట్టులో కూడా కోహ్లిని ఆరాధించే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ ఉమర్ గుల్ కూడా చేరిపోయాడు. ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కోహ్లి అభిమాని అని చెప్పుకొచ్చాడు. ‘భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు తాను సచిన్ అంటే ఇష్టపడేవాడిని. కానీ, ఇప్పుడు నాకు విరాట్ కోహ్లి అంటే విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. గత నాలుగైదేళ్లుగా కోహ్లి ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఒకప్పుడు చాలా అగ్రెసీవ్‌గా ఉండే వ్యక్తిగా కోహ్లిని చూశాను. ఇప్పుడు మాత్రం అతని ధ్యాసంతా ఆట మీదే ఉంది. కోహ్లి బ్యాటింగ్‌ను నేను ఎంతో ఆస్వాదిస్తాను’ అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు.
Tags:    

Similar News