సీఎం కేసీఆర్ కోసం మాజీ నక్సలైట్ బైక్ యాత్ర
దిశ, గుండాల : పోడు భూముల సమస్య పరిష్కరించాలని కోరుతూ మాజీ నక్సలైట్ కోరం వెంకటేశ్వర్లు అలియాస్ గణేష్ సీఎం కలవడానికి ప్రగతి భవన్‌కు బైక్ యాత్ర చేపట్టారు. మంగళవారం కాచనపల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల వివాదం కొనసాగుతోంది. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గణేష్ గత నెల 25వ తేదీన ములుగు జిల్లా మేడారంలో […]
దిశ, గుండాల : పోడు భూముల సమస్య పరిష్కరించాలని కోరుతూ మాజీ నక్సలైట్ కోరం వెంకటేశ్వర్లు అలియాస్ గణేష్ సీఎం కలవడానికి ప్రగతి భవన్‌కు బైక్ యాత్ర చేపట్టారు. మంగళవారం కాచనపల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల వివాదం కొనసాగుతోంది. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గణేష్ గత నెల 25వ తేదీన ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క ఆశీస్సులతో బైక్ యాత్ర ప్రారంభించారు. పలు నియోజవర్గాల్లో పర్యటించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలకు వినతి పత్రాలు సమర్పించారు. కాగా, మంగళవారం గుండాల మండలం కాచనపల్లి గ్రామంలో బైక్ యాత్ర ముగించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను కలవడానికి ప్రగతిభవన్‌కు బయల్దేరారు.