హైదరాబాద్‌లో 4 లక్షల ‘డబుల్’ ఇండ్లేవి : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి
దిశ, చార్మినార్: మాయమాటలతో పేదలను మభ్యపెట్టాలని చూస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట జోన్ 4వ మహాసభ ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సభలో సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎన్. సోమయ్యతో కలిసి చెరుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతరాములు మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం పేదలపై మోయలేని భారం మోపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ […]
దిశ, చార్మినార్: మాయమాటలతో పేదలను మభ్యపెట్టాలని చూస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట జోన్ 4వ మహాసభ ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సభలో సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎన్. సోమయ్యతో కలిసి చెరుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతరాములు మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం పేదలపై మోయలేని భారం మోపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం నాలుగు వేల ఇండ్లనే కట్టించిందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు కోటి రెడ్డి, కిషన్, కృష్ణనాయక్, రామ్ కుమార్, సత్తయ్య, లక్ష్మమ్మ, శ్రీను, నిర్మల, గౌస్ ఖాన్, గోపాల్, నాగేష్, సంతోష్, లక్ష్మి, విజయ, జంగయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.