టీడీపీకి మరో షాక్.. కీలక నేత అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంటుంది. మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయం మరచిపోకముందే మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వడం టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఓ హత్య కేసుకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద […]

Update: 2021-03-12 06:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంటుంది. మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయం మరచిపోకముందే మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వడం టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఓ హత్య కేసుకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సత్తిరాజురెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసి కోర్టులో హారుపరిచారు. అనంతరం ఆయన్ను కాకినాడ సబ్ జైలుకు తరలించారు. సబ్ జైలు వద్ద పలువురు టీడీపీ నేతలు రామకృష్ణారెడ్డిని కలిశారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. రోడ్డుపై నిరసనకు దిగారు. రాజకీయ కారణాలతోనే తమ నాయకుడిని అరెస్టు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బావ హత్య అంశాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు వాడుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Tags:    

Similar News