రైతు సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే దీక్ష
దిశ, నిజామాబాద్: రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలం అయిందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ శాసన సభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కేంద్రం మద్ధతు ధర ఇచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో రాష్ర్టప్రభుత్వం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. […]
దిశ, నిజామాబాద్: రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలం అయిందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ శాసన సభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కేంద్రం మద్ధతు ధర ఇచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో రాష్ర్టప్రభుత్వం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మిల్లర్ల దోపిడి జరుగుతున్నదని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.
Tags : Former MLA yendala laxminarayana, farmer, crop, bjp, protect, nzb