ప్రాణాలతో చెలగాటం ఆడటానికి… ఇది పబ్జీ గేమ్ కాదు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. దీని కారణంగా ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా విఫలం చెందిందని ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారికి వైరస్‌కు గేట్లు ఎత్తేశారని.. కరోనా నియంత్రణలో చేతులెత్తేశారని విమర్శించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ముందస్తు నియామకాల్లో వైఫల్యం చెందారన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. దీని కారణంగా ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా విఫలం చెందిందని ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారికి వైరస్‌కు గేట్లు ఎత్తేశారని..
కరోనా నియంత్రణలో చేతులెత్తేశారని విమర్శించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ముందస్తు నియామకాల్లో వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. అమెరికా, బ్రెజిల్ స్థాయికి ఏపీ చేరడం సిగ్గుచేటన్నారు. మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా? అని యనమల ప్రశ్నించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోడానికి కూడా జగన్ సిద్ధంగా లేరన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పబ్జీ గేమ్ కాదన్నారు.
‘రోజుకు 90 మంది ప్రాణాలు పోతుంటే, నిద్ర ఎలా పడుతోంది? కేంద్రం ఇచ్చిన రూ.8 వేల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు.