టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం

దిశ, ఖమ్మం రూరల్: ప్రతీ కార్యకర్తా సంయమనం పాటించాలని.. మనకూ మంచిరోజులోస్తాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల అనుచరులమైన మాపై ఎమ్మెల్యే కందాల వర్గం అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని తుమ్మలతో వాపోయారు. అనంతరం తుమ్మల స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని, అంతవరకూ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఎవరైనా గ్రామాల్లో కవ్వింపు […]

Update: 2021-07-30 06:35 GMT

దిశ, ఖమ్మం రూరల్: ప్రతీ కార్యకర్తా సంయమనం పాటించాలని.. మనకూ మంచిరోజులోస్తాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల అనుచరులమైన మాపై ఎమ్మెల్యే కందాల వర్గం అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని తుమ్మలతో వాపోయారు. అనంతరం తుమ్మల స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని, అంతవరకూ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఎవరైనా గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఓపిక పట్టాలని, గెలుపోటములు సహజం అని సూచించారు. ఎవరూ అదైర్యపడొద్దని, రానున్న రోజులు మనవే అని హామీ ఇచ్చారు. అక్రమ కేసులతో కార్యకర్తలను అణిచివేయాలనుకోవడం అవివేకం అన్నారు. తుమ్మలను కలిసిన వారిలో రామసహాయం నరేష్​రెడ్డి, మద్ది మల్లారెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, సీతారాములు, శాఖమూరి రమేష్, బండి జగదీష్, ధరావత్ రామ్మూర్తినాయక్, తేజావత్ పంతులు, కొప్పుల చంద్రశేఖర్, మాదాసు ఉపేందర్, భాస్కర్, మహిపాల్, పొలూరి రమేష్, సురేష్, వీరభద్రం, పుల్లయ్య, గోపాల్, జానార్థన్‌లు ఉన్నారు.

Tags:    

Similar News