ఇసుక రవాణాతో కరోనా వ్యాప్తి.. క్వారీలు మూసేయండి : శ్రీధర్ బాబు

దిశ, పెద్దపల్లి : ఇసుక క్వారీలను వెంటనే మూసి వేయాలని కోరుతూ మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. మంథని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న సందర్భంగా అనేక లారీలు, ట్రాక్టర్లు సంచరిస్తున్నాయని తెలిపారు. లారీ, ట్రాక్టర్ డ్రైవర్‌లపైన సరైన థర్మల్ స్క్రీనింగ్, చెక్ పోస్టులు లేని కారణంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుందని, వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Update: 2021-05-28 09:45 GMT

దిశ, పెద్దపల్లి : ఇసుక క్వారీలను వెంటనే మూసి వేయాలని కోరుతూ మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. మంథని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న సందర్భంగా అనేక లారీలు, ట్రాక్టర్లు సంచరిస్తున్నాయని తెలిపారు. లారీ, ట్రాక్టర్ డ్రైవర్‌లపైన సరైన థర్మల్ స్క్రీనింగ్, చెక్ పోస్టులు లేని కారణంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుందని, వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

లారీ, ట్రాక్టర్ డ్రైవర్లు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, బతుకుదెరువు కోసం ఈ ప్రాంతంలో హోటళ్ళు చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మంథని మానేరు పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని వెంటనే దాన్ని అరికట్టాలని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం క్వారీలను వెంటనే మూసి వేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

Tags:    

Similar News