ఈఎస్ఐ స్కాంలో మరో అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో అక్రమాలు జరిగాయన్న కారణంగా ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యి, కోర్టులు, సీబీఐ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళీ మోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మురళీ మోహన్ అప్పట్లో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణకు […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో అక్రమాలు జరిగాయన్న కారణంగా ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యి, కోర్టులు, సీబీఐ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళీ మోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మురళీ మోహన్ అప్పట్లో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణకు పీఎస్‌గా పనిచేశారు. ఇక ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్‌గా ఆయన పని చేస్తున్నారు. ఇవాళ ఉదయం సచివాలయంలో ఉన్న మురళిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే ఈ కుంభకోణం దృష్ట్యా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్, ఈ మురళి మోహన్‌లు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ కేసును రిజర్వ్‌లో ఉంచింది. దీంతో పితాని సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకోవడం ఖాయమనే సంకేతాలను ఇచ్చినట్టయింది. తండ్రి కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సురేష్ ఆ శాఖలో చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి.