అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసుతో తనకేం సంబంధం లేదని, అనారోగ్యంతో ఉన్న కారణంగా బెయిల్ మంజూరు చేయాలని అఖిల ప్రియ తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో అఖిల ప్రియను మరింత విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో […]
దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసుతో తనకేం సంబంధం లేదని, అనారోగ్యంతో ఉన్న కారణంగా బెయిల్ మంజూరు చేయాలని అఖిల ప్రియ తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో అఖిల ప్రియను మరింత విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ పిటిషన్‌పై శుక్రవారమే వాదనలు జరగగా, అదే రోజు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో న్యాయమూర్తి రెండు పిటీషన్లను విచారణకు స్వీకరించి విచారించారు. అనంతరం సోమవారానికి వాయిదా వేశారు. దీంతో నేడు బెయిల్ పిటిషన్‌తో పాటు పోలీస్ కస్టడీ పిటీషన్‌పై కూడా కోర్టులో విచారణ కొనసాగనుంది.