ఆ పనులు చేయడం సిగ్గుచేటు ;అచ్చెన్నాయుడు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోజేఎంఎం పేరిట మూడు రకాల ట్యాక్స్‌ల దందా నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రస్థాయిలో జె ట్యాక్స్‌.. జిల్లా స్థాయిలో మంత్రి ట్యాక్స్‌.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్స్‌ అమలవుతోందని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ పని ప్రారంభించాలన్నా కొబ్బరికాయ కొట్టే ముందు జె ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోందనడానికి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు […]

Update: 2021-09-06 10:21 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోజేఎంఎం పేరిట మూడు రకాల ట్యాక్స్‌ల దందా నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రస్థాయిలో జె ట్యాక్స్‌.. జిల్లా స్థాయిలో మంత్రి ట్యాక్స్‌.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్స్‌ అమలవుతోందని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ పని ప్రారంభించాలన్నా కొబ్బరికాయ కొట్టే ముందు జె ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోందనడానికి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే నిదర్శనమని చెప్పుకొచ్చారు.

రాయదుర్గంలో జయరామిరెడ్డి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని.. పనులు చేస్తున్నవారిని బెదిరించడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ నేతల తీరుతో రాష్ట్రంలో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదంటూ ధ్వజమెత్తారు. వైసీపీలోని కీలక నేతలు మద్యం, ఇసుక, మైనింగ్‌, జూదం ద్వారా కోట్లు సంపాదించారని..అది సరిపోదన్నట్లు ఇప్పుడు కాంట్రాక్టర్లపై పడ్డారని మండిపడ్డారు. పర్సంటేజ్‌లు ఇవ్వలేదనే అక్కసుతో రాష్ట్రంలో అనేకమంది కాంట్రాక్టర్లను తరిమేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Tags:    

Similar News