పోలీస్ అయ్యాడని మాజీ మావోయిస్టు కమాండర్ దారుణ హత్య!

దిశ, వెబ్‌డెస్క్ : రక్తం పంచుకోని పుట్టిన సోదరులు ఇద్దరు సమసమాజ స్థాపనే లక్ష్యంగా మావోయిస్టు పార్టీలో చేరారు. కొంత కాలమయ్యాక ఆ ఇద్దరిలో ఒకరు అన్నల దారిని వదిలి.. ఖాకీల దారిని ఎంచుకొని పోలీస్ అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒకరిది సమసమాజ స్థాపన కోసం పోరాటమైతే మరోకరిది రాజ్యాన్ని కాపాడే (పోలీస్) రక్షకుడయ్యాడు. కానీ తనను అన్నల్లోకి నడిపించుకు వెళ్లిన సోదరుడే ఇది నచ్చక దళ సభ్యులతో కలిసి సొంత ఇంటిలోనే పోలీస్ సోదరుడిని పొడిచి […]

Update: 2021-01-31 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రక్తం పంచుకోని పుట్టిన సోదరులు ఇద్దరు సమసమాజ స్థాపనే లక్ష్యంగా మావోయిస్టు పార్టీలో చేరారు. కొంత కాలమయ్యాక ఆ ఇద్దరిలో ఒకరు అన్నల దారిని వదిలి.. ఖాకీల దారిని ఎంచుకొని పోలీస్ అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒకరిది సమసమాజ స్థాపన కోసం పోరాటమైతే మరోకరిది రాజ్యాన్ని కాపాడే (పోలీస్) రక్షకుడయ్యాడు. కానీ తనను అన్నల్లోకి నడిపించుకు వెళ్లిన సోదరుడే ఇది నచ్చక దళ సభ్యులతో కలిసి సొంత ఇంటిలోనే పోలీస్ సోదరుడిని పొడిచి చంపారు. పేగు తెంచుకు పుట్టినా వర్గ శత్రు నిర్మూనలో రక్త సంబంధంపై మమకారం ఉండదని నిరూపించాడు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మాజీ మావోయిస్టు కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI Maoist)నుంచి బయటకు వచ్చి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరినందుకు అతన్ని సొంత సోదరుడే హతమార్చడు. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందేరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమురామ్ పోయం అలియాస్ మల్లేష్ గతంలో మావోయిస్టు కమాండర్‌గా పనిచేశాడు. సీపీఐ (మావోయిస్టు) నుంచి వైదొలిగిన ఆయన 2014 బీజాపూర్‌లో లొంగిపోయాడు. అనంతరం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)లో కానిస్టేబుల్‌గా చేరి బీజాపూర్ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి మల్లేష్.. జంగల పీఎస్ పరిమితిలోని తన స్వగ్రామమైన కొట్రపాల్‌కు వెళ్లాడు. ముందు నుంచే అతనిపై నిఘా ఉంచిన మావోయిస్టులు అదే రాత్రే అక్కడికి చేరుకున్నారు. మల్లేష్ సోదరుడు కోసాతో కలిసి మావోయిస్టులు అతడిని పదునైన ఆయుధాలతో పొడిచి చంపారు. మృతదేహానికి అతడి కుటుంబ సభ్యుల ముందే నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకుని మృతుడి అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మృతుడి సోదరుడు కోసా, ఇతర మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్‌కు ఆదేశించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందేరాజ్ తెలిపారు.

ఇదిలా ఉండగా, కొత్తగా ఏర్పాటైన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC)జోన్ పరిధిలోని రాజ్‌నందగావ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో ఇద్దరు గ్రామస్తులు, డిప్యూటీ సర్పంచ్, కాంట్రాక్టర్‌తో సహా గత ఐదురోజుల్లో మొత్తం ఆరుగురిని మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసు నివేదికలు వెల్లడించాయి. అదేవిధంగా 2020లో బస్తర్ అటవీ ప్రాంతంలో 308మంది మావోయిస్టులు జరిపిన దమనకాండలో మొత్తం 36మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. 46మంది పౌరులు మరణించినట్లు పోలీసు రికార్డులు చూపిస్తున్నాయి.

ఇదే నెలలో రెండో ఘటన..

జనవరి-2020లో మాజీ మావోయిస్టు సభ్యుడు ఒకరు లొంగిపోయి పోలీసు శాఖలో చేరాడు. అది నచ్చని మావోయిస్టు అయిన సొంత అన్న.. తమ్ముడిని హతమార్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ లోని దంతేవాడ జిల్లాలో జరిగింది. అంతకుముందు లక్ష్మణ మాండవి అనే బాధితుడిని కొంతమంది వ్యక్తులు ప్లాన్ ప్రకారం అడవికి పిలిపించారు. అనంతరం చుట్టుముట్టిన మావోయిస్టులు పదునైన ఆయుధాలతో పొడిచి హత్యచేశారు. 2019లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో వర్గీస్ అనే మావోయిస్టు లీడర్ మృతి చెందాడు. అతడి మరణానికి లక్ష్మణ్ కారణమని భావించి మావోయిస్టులు ప్రతీకార హత్యకు పాల్పడినట్లు సమాచారం.

Tags:    

Similar News