బ్రేకింగ్ న్యూస్.. మాజీ హోంమంత్రి అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్టయ్యారు. 12 గంటలకుపైగా ఆయనను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ప్రకటించింది. అయితే, అనిల్ దేశ్ ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలో రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ. 100 కోట్ల వరకు వసూలు చేయాలని ఓ పోలీస్ అధికారిని అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో […]

Update: 2021-11-01 21:03 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్టయ్యారు. 12 గంటలకుపైగా ఆయనను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ప్రకటించింది. అయితే, అనిల్ దేశ్ ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలో రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ. 100 కోట్ల వరకు వసూలు చేయాలని ఓ పోలీస్ అధికారిని అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో హోంమంత్రి పదవికి దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఈ కేసులో దేశ్ ముఖ్ విచారణ చేసిన ఈడీ అరెస్ట్ చేసింది. అదేవిధంగా దేశ్ ముఖ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News