భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ మృతి
భారత ఫుట్‌బాల్ చరిత్రలో లెజండరీ ఆటగాడు, మాజీ కెప్టెన్ పీకే బెనర్జీ (83) శనివారం కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన బెనర్జీ కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. టీమ్ ఇండియా తరపున 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన బెనర్జీ 1962 జకార్తా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడు. తన కెరీర్‌లో 65 గోల్స్ సాధించిన ఆయన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆటగాడిగా […]
భారత ఫుట్‌బాల్ చరిత్రలో లెజండరీ ఆటగాడు, మాజీ కెప్టెన్ పీకే బెనర్జీ (83) శనివారం కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన బెనర్జీ కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. టీమ్ ఇండియా తరపున 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన బెనర్జీ 1962 జకార్తా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడు. తన కెరీర్‌లో 65 గోల్స్ సాధించిన ఆయన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆటగాడిగా కెరీర్ ముగించిన అనంతరం జట్టుకు కోచ్‌గా కూడా పని చేశారు. ఫుట్‌బాల్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగాను ఫిఫా 2004లో ‘సెంటెనియల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేసింది.
tags : Football, Legendary Player, PK Banerjee, Kolkata, Asian games