చేతన్ చౌహాన్ ఆరోగ్యం విషమం
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా మాజీ క్రికెటర్ (Former cricketer), ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీ సమస్య (Kidney problem)తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం గురుగ్రామ్ (Gurugram)లోని మెదంత ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. జూలైలో ఆయనకు కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి (Sanjay Gandhi Hospital)లో చేరారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటనే మెదంత ఆస్పత్రి (Medanta […]
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా మాజీ క్రికెటర్ (Former cricketer), ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీ సమస్య (Kidney problem)తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం గురుగ్రామ్ (Gurugram)లోని మెదంత ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
జూలైలో ఆయనకు కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి (Sanjay Gandhi Hospital)లో చేరారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటనే మెదంత ఆస్పత్రి (Medanta Hospital)కి తరలించారు. కొవిడ్ వ్యాధి (Kovid)కి చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం యోగి క్యాబినెట్ (Yogi Cabinet)లో మంత్రిగా పనిచేస్తున్న చేతన్ చౌహాన్ (Chetan Chauhan) 1969-78 కాలంలో టీం ఇండియా తరఫున 40 టెస్టులు 7 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 31.57 సగటుతో 2084 పరుగులు, వన్డేల్లో 153 పరుగులు చేశారు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 పరుగులు.