సీఎం జగన్‌తో మాజీ క్రికెటర్ అనిల్‌ కుంబ్లే భేటీ.. అందుకేనా..?

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. కర్ణాటకకు చెందిన అనిల్‌ కుంబ్లే సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనిల్‌ కుంబ్లే..ఆ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టిన సంగతి […]

Update: 2021-07-05 07:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. కర్ణాటకకు చెందిన అనిల్‌ కుంబ్లే సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనిల్‌ కుంబ్లే..ఆ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టిన సంగతి తెలిసిందే.

భేటీ వెనుక వ్యూహం ఇదేనా?

సీఎం జగన్‌తో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ..వారికి అవార్డులను సైతం అందజేస్తున్నారు సీఎం జగన్. ఇటీవలే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖపట్నంలో అకాడమీ ఏర్పాటుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అకాడమీ కోసం కేటాయించిన రెండెకరాల భూమికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం జగన్‌ పీవీ సింధుకు ఇటీవలే అందజేశారు. అలాగే ఏపీ నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు చెరో రూ.5 లక్షల చొప్పున చెక్‌లు అందజేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కుంబ్లే సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు కుంబ్లే ప్రయత్నిస్తున్నారా? అన్న సందేహం నెలకొంది. అందులో భాగంగా అనుమతులు, ప్రోత్సాహకాల కోసమే కలిశారంటూ ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ భేటీలో అనిల్ కుంబ్లే తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన ఘనతలను సీఎం జగన్‌కు వివరించడాన్ని పలువురు అందులో భాగమేనంటున్నారు. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన దిగ్గజ బౌలర్‌గా అనిల్ కుంబ్లేకు గుర్తింపు ఉంది. 2008లో ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం టీమిండియాకి హెడ్ కోచ్‌గా పనిచేశాడు. క్రికెట్ కెరీర్‌లో అనిల్ కుంబ్లే వివాదరహితుడిగా పేర్గాంచాడు.

Tags:    

Similar News