గడ్డి కుంభకోణంలో లాలూకు బెయిల్..
దిశ, వెబ్‌డెస్క్: పశువుల దాణా స్కాం కేసులో దోషిగా రుజువై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. వచ్చేనెలలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం లాలూకు జార్ఖండ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల విలువైన 2 వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే బెయిల్ పొందాలంటే సీబీఐ స్పెషల్ కోర్టు విధించిన రూ. 2లక్షల […]
దిశ, వెబ్‌డెస్క్: పశువుల దాణా స్కాం కేసులో దోషిగా రుజువై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. వచ్చేనెలలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం లాలూకు జార్ఖండ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రూ. 50వేల విలువైన 2 వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే బెయిల్ పొందాలంటే సీబీఐ స్పెషల్ కోర్టు విధించిన రూ. 2లక్షల పెనాల్టీని డిపాజిట్ చేయాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఇదిలాఉండగా, గడ్డి కుంభకోణం కేసులో లాలూకు ప్రస్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. లాలూపై దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో ప్రస్తుతం బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడులయ్యే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.