‘దేశద్రోహ చట్టం రద్దు’ : సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ VS చీఫ్ జస్టిస్..!

దిశ, వెబ్‌డెస్క్ : దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు మాజీ కోర్టు చీఫ్ జస్టిస్, రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సెడిషన్ లా’ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని తాను నిందించడం లేదని.. ‘‘దేశంలోని ప్రతీ చట్టం ఉపయోగ పడటంతో పాటు దుర్వినియోగం’’ కూడా కాగలదని స్పష్టంచేశారు. ‘‘దుర్వినియోగం పేరుతో చట్టాలు రద్దు చేయడానికి తగినంత కారణం’’ కూడా లేదన్నారు. బ్రిటీష్ కాలంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారిపై ‘దేశద్రోహం చట్టం’ […]

Update: 2021-07-18 02:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు మాజీ కోర్టు చీఫ్ జస్టిస్, రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సెడిషన్ లా’ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని తాను నిందించడం లేదని.. ‘‘దేశంలోని ప్రతీ చట్టం ఉపయోగ పడటంతో పాటు దుర్వినియోగం’’ కూడా కాగలదని స్పష్టంచేశారు. ‘‘దుర్వినియోగం పేరుతో చట్టాలు రద్దు చేయడానికి తగినంత కారణం’’ కూడా లేదన్నారు.

బ్రిటీష్ కాలంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారిపై ‘దేశద్రోహం చట్టం’ (IPC వివాదాస్పద సెక్షన్ 124 A) అమలు చేసేవారని, ఇప్పుడు దాని అవసరం ఏముందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని కూడా ఆదేశించారు. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని పలు రాష్ట్రాల్లో దేశద్రోహం కింద కేసులు నమోదు కావడాన్ని చీఫ్ జస్టిస్ తప్పుబట్టారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సెడిషన్ చట్టం కింద కేసులు పెడుతారా..? అంటూ’ కామెంట్స్ చేశారు.

తాజాగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలపై.. టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్‌తో జరిపిన ప్రత్యేక సంభాషణలో ‘రంజన్ గొగోయ్’ దేశద్రోహ చట్టం మరియు దాని చుట్టూ ఉన్న వివాదాలను సవివరంగా వెల్లడించారు. ‘చట్టాలను సవాలు చేసే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ధోరణి’ ఉంది. దేశద్రోహాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రతీ చట్టం ఉపయోగంతో పాటు దుర్వినియోగం కాగలదు. చట్టాన్ని రద్దు చేయడానికి దుర్వినియోగం అనే కారణం సరిపోదని’’ తెలిపారు.

ఇటీవల దేశద్రోహ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మాటలను రాజ్యసభ ఎంపీ గుర్తుచేస్తూ.. ‘‘ దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలని చీఫ్ జస్టిస్ చెప్పారని నేను అనుకోను. సెక్షన్ 124 ఎ భారత శిక్షాస్మృతిలోని 6వ అధ్యాయంలో భాగం’’ అని అన్నారు.

ఒకవేళ చట్టం దుర్వినియోగం అయిన సందర్భంలో పరిస్థితిని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని రాజ్యసభ ఎంపీ వివరించారు. ‘‘చట్టం యొక్క చట్టబద్ధతను న్యాయస్థానం నిర్ణయిస్తుందని’’ మరియు ‘‘చట్టం యొక్క అవసరాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని’’ తెలిపారు. ‘ప్రభుత్వమే చట్టాన్ని విస్మరించాలని ఎంచుకుంటే, అది ప్రభుత్వం తప్పు అవుతుందని’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

మూలాల నుండి చట్టాలను తగ్గించడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదని, చట్టం యొక్క చట్టబద్ధతను సవాలు చేయడం చివరి ఆశ్రయం అని నొక్కి చెప్పారు. సంభాషణను ముగించే క్రమంలో ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక ప్రసంగం ప్రజలను ప్రేరేపిస్తే అది దేశద్రోహమేనని’’ ఆయన నొక్కి చెప్పారు.

Tags:    

Similar News