బీజేపీ తోడైనా ఈటలకు అంత సీన్ లేదు..

దిశ, జమ్మికుంట : కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లిన ఈటలకు బీజేపీ అధినాయకత్వం సరైన రీతిలో గౌరవించకపోవడంతో రాష్ట్రంలో ఈటలకు ఊహించిన సీన్ లేదని తేటతెల్లం అయిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావు విమర్శించారు. మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల ఎంతో ఊహించుకుని ఢిల్లీకి వెళ్లి నిరాదరణకు గురై ఉన్న పరువు, ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు […]

Update: 2021-06-15 08:16 GMT

దిశ, జమ్మికుంట : కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లిన ఈటలకు బీజేపీ అధినాయకత్వం సరైన రీతిలో గౌరవించకపోవడంతో రాష్ట్రంలో ఈటలకు ఊహించిన సీన్ లేదని తేటతెల్లం అయిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావు విమర్శించారు. మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల ఎంతో ఊహించుకుని ఢిల్లీకి వెళ్లి నిరాదరణకు గురై ఉన్న పరువు, ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని అన్నారు.

ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలకు క్షమాపణ వకుళాభరణం డిమాండ్ చేశారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవకాశాలు కల్పించిన టీఆర్ఎస్ పై చేసిన కుట్రలను, ఆయన నిజ స్వరూపాన్ని గమనించే బీజేపీ ఢిల్లీలో ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనపై విముక్తికి పోరాటం చేస్తానని ప్రగల్బాలు పలకటం అవివేకమన్నారు. ఇప్పటికైనా, ఈటల రాజేందర్ తాహతకు మించి మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. రానున్న ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్, రాం స్వారణ్ రెడ్డి, తిప్పర వేణి మొగిలి, దరుగుల రాకేష్, మహేందర్, అనిల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News