బాబు అక్రమాస్తుల కేసు 21కి వాయిదా..

దిశ, క్రైమ్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులపై నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదు చేసిన కేసు ఈ నెల 21కి వాయిదా పడింది. 1987 నుంచి 2005 వరకూ చంద్రబాబు తన వ్యక్తిగత ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలోనే ఏసీబీ కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా.. చంద్రబాబు నాయుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల ఆ స్టే గడువు […]

Update: 2020-10-09 12:04 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులపై నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదు చేసిన కేసు ఈ నెల 21కి వాయిదా పడింది. 1987 నుంచి 2005 వరకూ చంద్రబాబు తన వ్యక్తిగత ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలోనే ఏసీబీ కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా.. చంద్రబాబు నాయుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

ఇటీవల ఆ స్టే గడువు ముగియడంతో.. ఈ కేసు అంశం శుక్రవారం విచారణకు వచ్చింది. కాగా, వాదోపవాదాల అనంతరం మరల విచారణను 21కి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజా, మాజీ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతం కావడంతో శుక్రవారం చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది.

Tags:    

Similar News