శ్రీలంక గెలవడం మర్చిపోయింది : ముత్తయ్య మురళీధరన్

దిశ, స్పోర్ట్స్: ప్రస్తుత శ్రీలంక జట్టు మ్యాచ్‌లను ఎలా గెలవాలో అనే విషయాన్ని మర్చిపోయిందని దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. మంగళవారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పటిష్ట స్థితి నుంచి శ్రీలంక జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై మురళీధరన్ స్పందించారు. ‘చాలా ఏళ్లుగా శ్రీలంక గెలవడం మర్చిపోయింది. ప్రస్తుతం మా దేశ క్రికెట్ చాలా కఠినమైన కాలాన్ని ఎదుర్కుంటున్నది. గెలిచే మార్గాలను ప్రస్తుత జట్టు మర్చిపోయింది. వానిందు హసరంగ మూడు వికెట్లు తీసిన తర్వాత […]

Update: 2021-07-21 08:07 GMT

దిశ, స్పోర్ట్స్: ప్రస్తుత శ్రీలంక జట్టు మ్యాచ్‌లను ఎలా గెలవాలో అనే విషయాన్ని మర్చిపోయిందని దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. మంగళవారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పటిష్ట స్థితి నుంచి శ్రీలంక జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై మురళీధరన్ స్పందించారు. ‘చాలా ఏళ్లుగా శ్రీలంక గెలవడం మర్చిపోయింది. ప్రస్తుతం మా దేశ క్రికెట్ చాలా కఠినమైన కాలాన్ని ఎదుర్కుంటున్నది. గెలిచే మార్గాలను ప్రస్తుత జట్టు మర్చిపోయింది.

వానిందు హసరంగ మూడు వికెట్లు తీసిన తర్వాత భారత జట్టు కష్టాల్లో పడింది. అక్కడ నుంచి వారిని పూర్తిగా అణగదొక్కాల్సింది. కానీ దీపక్ చాహర్, భువనేశ్వర్ చక్కని క్రికెటింగ్ స్కిల్స్ ప్రదర్శించి ఇండియాకు విజయాన్ని అందించారు. అలాంటి గెలుపు మార్గాలను శ్రీలంక కూడా వెతకాల్సి ఉన్నది. శ్రీలంక జట్టు మంగళవారం నాటి మ్యాచ్‌లో పలు తప్పులు చేసింది. హసరంగ వికెట్లు తీస్తున్నప్పుడు అతడినే కంటిన్యూ చేయించాల్సింది. అలా కాకుండా అతడిని దూరంగా పెట్టింది. దీంతో సరైన సమయంలో వికెట్ పడక శ్రీలంక ఇబ్బంది పడింది’ అని మురళీధరన్ అన్నాడు.

Tags:    

Similar News