ఫర్టిలైజర్ షాప్ యజమానిపై ఫోర్జరీ కేసు
దిశ, దేవరకొండ: దేవర కొండలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ షాప్ యజమానిపై ఓ రైతు ఫోర్జరీ కేసు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం… కుర్మేడ్ గ్రామానికి చెందిన జడ మంగయ్యకు గ్రామం లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా ఉంది. కాగా అతని ఖాతా నుంచి ఈ నెల 7న రూ.6వేలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో సదరు బ్యాంకును సంప్రదించాడు. అయితే అదే గ్రామానికి చెందిన […]
దిశ, దేవరకొండ: దేవర కొండలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ షాప్ యజమానిపై ఓ రైతు ఫోర్జరీ కేసు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం… కుర్మేడ్ గ్రామానికి చెందిన జడ మంగయ్యకు గ్రామం లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా ఉంది. కాగా అతని ఖాతా నుంచి ఈ నెల 7న రూ.6వేలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో సదరు బ్యాంకును సంప్రదించాడు.
అయితే అదే గ్రామానికి చెందిన తిరుమల ఎరువులు, విత్తనాల దుకాణం యజమాని రాచకొండ ప్రసాద్ అకౌంట్‌కు ఆ డబ్బులు బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ప్రసాద్‌ను అడగ్గా తాను సర్పంచ్ భర్తనని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడు. దీంతో వారు ఈ నెల 11 న అతనిపై ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ జరిపి ఫోర్జరీ జరిగినట్టు నిర్దారించారు. దీంతో ప్రసాద్ పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.