‘జాకోరా’ లో తుపాకుల కలకలం

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకొరా ప్రాంతంలో తుపాకుల కలకలం రేపింది ..వర్ని అటవీ ప్రాంతంలో హైదరాబాద్ ఫారెస్ట్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అఫది ఫారం రైస్ మిల్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్ ఖాన్ దాడులు నిర్వహించారు. సుమారు 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గర నుంచి రెండు ఫారెన్ మేడ్ తుపాకులు, కుందేలు మాంసం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. […]

Update: 2020-12-20 07:51 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకొరా ప్రాంతంలో తుపాకుల కలకలం రేపింది ..వర్ని అటవీ ప్రాంతంలో హైదరాబాద్ ఫారెస్ట్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అఫది ఫారం రైస్ మిల్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్ ఖాన్ దాడులు నిర్వహించారు. సుమారు 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గర నుంచి రెండు ఫారెన్ మేడ్ తుపాకులు, కుందేలు మాంసం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అవి లైసెన్స్ తుపాకులు అయి వుంటాయని అధికారుల అంచనా వేస్తున్నారు. వర్ని అటవీ ప్రాంతంలో వారు వేటకు వెళుతున్నారని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారిని నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అప్పగించారు.

Tags:    

Similar News