బందీగా పశుకాపరులు.. తెల్లకాగితాలపై సంతకం చేయించిన అధికారులు

దిశ, అచ్చంపేట : నల్లమల అడవి, జంతు సంరక్షణ కోసం ఫారెస్ట్ ఆఫీసర్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. చివరకు అడవిలో పశుగ్రాసం కోసం వచ్చిన కాపరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలోని మద్దిమడుగు రేంజ్‌ పరిధి ఇసుక రేగడి అటవీ ప్రాంతంలో స్థానిక రైతులు, కాపరులు పశుగ్రాసం కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లికి చెందిన అంజి, అశోక్ అనే ఇద్దరు పశు కాపరులు […]

Update: 2021-07-09 00:35 GMT

దిశ, అచ్చంపేట : నల్లమల అడవి, జంతు సంరక్షణ కోసం ఫారెస్ట్ ఆఫీసర్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. చివరకు అడవిలో పశుగ్రాసం కోసం వచ్చిన కాపరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలోని మద్దిమడుగు రేంజ్‌ పరిధి ఇసుక రేగడి అటవీ ప్రాంతంలో స్థానిక రైతులు, కాపరులు పశుగ్రాసం కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లికి చెందిన అంజి, అశోక్ అనే ఇద్దరు పశు కాపరులు కూడా వచ్చారు. వీరిని గమనించిన అధికారులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మన్ననూరు అటవీశాఖ కాటేజీ‌లో బందీగా ఉంచిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు తెలిపిన వివరాలు..

‘గత మూడు దశాబ్దాలకు పైగా నల్లమల అటవీ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలైన ఇసుక రేగడి, తీగమానులో పశువులను మేపేందుకు వస్తున్నాం. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్‌లో అటవీ ప్రాంతంలో పశువులను మేపుతూ.. వేసవి కాలం సమీపిస్తుండగానే కృష్ణానదిని దాటి ఏపీలో పశుగ్రాసం కోసం వెళ్తాము.. ఇది నిత్యం జరుగుతోంది. పశువులకు తిండిపెట్టనీయకుండా అటవీశాఖ అధికారులు ఆంక్షలతో ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తే మూగజీవాల పరిస్థితి ఏంటి.. మా జీవనం దీనిపైనే ఆధారపడి ఉంది.. కాదంటే చావే శరణ్యమని’ పశుకాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అదుపులోకి తీసుకున్నారని ఉదయం 11 గంటలకు ఇడ్లీలు తిన్నామని.. (శుక్రవారం ఉదయం)ఇప్పటివరకు అన్నం కూడా పెట్టలేదని బాధితులు వాపోయారు. తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నారని.. అటవీశాఖ అధికారులు పెడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.

లక్షల్లో ఫైన్ లేదా జైలుకు

అటవీశాఖ నిబంధనల ప్రకారం పశువులను పశుగ్రాసం కోసం అడవికి తీసుకువచ్చినందుకు ఒక ఎద్దుకు రూ. 10 వేల చొప్పున సుమారుగా రూ. 20 లక్షలు ఫైన్ కట్టాలి, ఆ అపరాధ రుసుము చెల్లిస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఫైన్ కట్టలేకపోతే జైలుకు పంపేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సామాన్యులపై ఇలాంటి భారం వేస్తే.. బ్రతకడం కష్టం అయితే చావే శరణ్యమని బాధితులు వాపోతున్నారు.

Tags:    

Similar News