పాక్ పౌరులను తరలించేందుకు సిద్ధం

          కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై కరుణ చూపింది. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో చైనాలోని వూహాన్‌లో ఉన్న పాక్ పౌరులను ఇస్లామాబాద్‌కు తరలించేందుకు సిద్దమని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. కాగా, ఇటీవల భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వూహాన్ నుంచి వెనక్కు తీసుకొచ్చింది. ఇండోనేషియా, సూడాన్ దేశాలు అదే దారిలో నడిచాయి. అయితే పాకిస్థాన్ మాత్రం కరోనాను నియంత్రించే శక్తి తమకు […]

Update: 2020-02-07 09:17 GMT

కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై కరుణ చూపింది. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో చైనాలోని వూహాన్‌లో ఉన్న పాక్ పౌరులను ఇస్లామాబాద్‌కు తరలించేందుకు సిద్దమని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. కాగా, ఇటీవల భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వూహాన్ నుంచి వెనక్కు తీసుకొచ్చింది. ఇండోనేషియా, సూడాన్ దేశాలు అదే దారిలో నడిచాయి. అయితే పాకిస్థాన్ మాత్రం కరోనాను నియంత్రించే శక్తి తమకు లేదని, దీంతో అక్కడే ఉండాలని తమ దేశ పౌరులు సూచించింది. పాక్ చేసిన ఈ ప్రకటనపై ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న పాక్ విద్యార్థులను రక్షించేందుకు భారత్ ముందుకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News