తెలంగాణలో మాస్కులు లేనివారికి రూ. 500, 1000 ఫైన్..

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు పాటించకుండా మాస్కులు ధరించని వారికి అధికారులు, పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మాస్కులు ధరించని 12 మందికి పోలీసులు జరిమానాలు విధించారు. పెనుబల్లి మండలం వియంబంజార్‌లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్లు విధించినట్టు […]

Update: 2021-03-30 07:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు పాటించకుండా మాస్కులు ధరించని వారికి అధికారులు, పోలీసులు జరిమానా విధిస్తున్నారు.

ఈరోజు ఖమ్మం జిల్లాలో మాస్కులు ధరించని 12 మందికి పోలీసులు జరిమానాలు విధించారు. పెనుబల్లి మండలం వియంబంజార్‌లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్లు విధించినట్టు పోలీసులు తెలిపారు. 12 మందికి రూ. 500, రూ. 1000 చొప్పున జరిమానా విధించినట్టు పోలీసులు వెల్లడించారు. తప్పకుండా ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని పోలీసులు హెచ్చరించారు.

 

Tags:    

Similar News