ఆ దాడులకు, వైసీపీకి సంబంధం లేదు : సుచరిత

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. ముఖ్యమంత్రిపై పట్టాభి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. టీడీపీ వ్యవహార శైలి అనుమానం కలిగిస్తోంది. మీ కార్యకర్తలతోనే మీరు దాడులు చేయించుకున్నారేమోనని అనుమానం ఉంది. విధానపరంగా ప్రశ్నించకుండా.. కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు డైరెక‌్షన్‌లోనే ఇదంతా జరుగుతుంది. మీరే రెచ్చగొట్టి మీరే దాడులు చేస్తున్నారంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ […]

Update: 2021-10-19 12:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. ముఖ్యమంత్రిపై పట్టాభి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. టీడీపీ వ్యవహార శైలి అనుమానం కలిగిస్తోంది. మీ కార్యకర్తలతోనే మీరు దాడులు చేయించుకున్నారేమోనని అనుమానం ఉంది. విధానపరంగా ప్రశ్నించకుండా.. కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు డైరెక‌్షన్‌లోనే ఇదంతా జరుగుతుంది. మీరే రెచ్చగొట్టి మీరే దాడులు చేస్తున్నారంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్, మల్లాది విష్ణులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని అందులో భాగమే ఈ దాడులని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News