గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ భోజనం

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అన్నారు. బుధవారం బోరబండలోని పేద కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వీలైనంత వరకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. ఇంకా కొంతమందికి అవసరమైన పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున […]

Update: 2020-04-15 06:05 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అన్నారు. బుధవారం బోరబండలోని పేద కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వీలైనంత వరకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. ఇంకా కొంతమందికి అవసరమైన పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున భోజనం ప్యాకెట్లను అందించినందుకు రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Tags : Green India Challenge, Santosh Kumar, Deputy Mayor, GHMC, Food packets

Tags:    

Similar News