ఉప్పొంగిన వాగు..వెనుదిరిగి వచ్చిన భక్తులు..

మండలంలోని నల్లుర్తి గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో

Update: 2024-09-02 09:00 GMT

దిశ,మామడ : మండలంలోని నల్లుర్తి గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భీమన్న ఆలయంలో సోమవారం జాతర నిర్వహించాల్సి ఉంది. వాగు ఉప్పొంగడంతో భక్తులు వెనుదిరిగి ఇంటికి వెళ్లారు. కేవలం నిర్వాహకులు మాత్రమే వాగు దాటుకుంటూ వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ సమీపంలోని కొండపైన భీమన్న పండుగ జరుపుకోవలసి ఉండగా భారీ వర్షాల కారణంగా ఆలయ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో కొంగుబంగారంగా కొలిచి భీమన్న స్వామిని దర్శించుకోలేక భక్తులు ఇంటికి తిరిగి వచ్చారు. వరుణుడు కరుణిస్తే ఆదివారం (తిరుగారం) రోజైన దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటామని భక్తులు పేర్కొన్నారు.


Similar News