నిండు కుండలా కోయిల్‌సాగర్..!
దిశ, దేవరకద్ర: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో బండర్‌పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దగ్గరికి మత్స్యకారులు, స్థానికులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు సరళసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆటోమెటిక్ సైఫాన్లు ఓపెన్ అవ్వడంతో.. […]
దిశ, దేవరకద్ర: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో బండర్‌పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దగ్గరికి మత్స్యకారులు, స్థానికులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు సరళసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆటోమెటిక్ సైఫాన్లు ఓపెన్ అవ్వడంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.